News August 26, 2024

రేపు కవిత బెయిల్‌పై తీర్పు.. ఢిల్లీకి BRS ఎమ్మెల్యేలు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు రవిచంద్ర, సురేశ్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ఆమెకు బెయిల్ వస్తుందని BRS ఆశాభావంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు.

Similar News

News March 10, 2026

రణ్‌వీర్ అప్‌కమింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

image

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్‌వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్‌వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్‌లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్‌వీర్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్

image

సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరింది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD వెల్లడించింది.

News March 10, 2026

గాయపడ్డ మొజ్తబా ఖమేనీ?

image

ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ఆ దేశ TV ఛానల్ ఒకటి ఆయనను ‘జాన్‌బాజ్ ఆఫ్ రంజాన్’(గాయపడ్డ యుద్ధ వీరుడు) అని సంబోధించడమే ఈ వార్తలకు కారణమని India Today తెలిపింది. మొజ్తబా ఎన్నికను ట్రంప్ ఇప్పటికే వ్యతిరేకించారు. దీంతో US-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్‌కు గాయాలయ్యాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దాడుల్లో ఇప్పటికే అలీ ఖమేనీ, కుటుంబం మృతి చెందింది.