News September 12, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు తీర్పు

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. కేజ్రీవాల్, సీబీఐ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు.

Similar News

News October 15, 2024

పార్టీ గుర్తు విషయంలో ఈసీదే అంతిమ నిర్ణయం: శరద్ పవార్

image

పార్టీ గుర్తుపై ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయమని ఎన్సీపీ-పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ విషయంలో ఈసీ ఆదేశాలను తాము స్వీకరించాల్సిందేనని చెప్పారు. గత ఏడాది పార్టీ రెండుగా విడిపోవడంతో మెజారిటీ ఆధారంగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా శరద్ వర్గానికి ‘బాకా ఊదుతున్న వ్యక్తి’ గుర్తును కేటాయించింది.

News October 15, 2024

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కసరత్తు

image

AP: బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. SC, ST అట్రాసిటీ చట్టం మాదిరిగానే BCల కోసం దీన్ని అందుబాటులోకి రానుంది. 8 మంది మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, అనగాని, పార్థసారథి, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సచివాలయంలో విధివిధానాల రూపకల్పనపై చర్చించారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.

News October 15, 2024

రేపు క్యాబినెట్ భేటీ.. కీలక పథకానికి ఆమోదం?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌‌, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగంపై 5-6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు వస్తాయని తెలుస్తోంది.