News April 17, 2024

ఏబీవీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

AP: తనను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ IPS AB.వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై CAT తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చారని ఆయనపై అభియోగాలు రావడంతో సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం ఈ కేసులో సాక్ష్యులను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో మళ్లీ సస్పెండ్ అయ్యారు. దీనిపై ఆయన CATను ఆశ్రయించగా.. 23న తీర్పు రానుంది.

Similar News

News November 18, 2024

స్కూళ్ల టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే..

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం ఉ.9 గం. నుంచి సా.4 గం. వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సా.5 గం. వరకు విద్యాశాఖ పొడిగించింది. ఈనెల 25-30 వరకు కొత్త టైమ్‌టేబుల్‌ను తొలుత ప్రతి మండలంలోని 2 బడుల్లో అమలు చేయనుంది. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్ సమయాన్ని 5 ని. చొప్పున, భోజన విరామాన్ని 15ని. పెంచారు. ఉ. తొలి పీరియడ్ 5ని. పెంచి 50ని. చేశారు. తర్వాతి 3 పీరియడ్లను కూడా 5ని. చొప్పున పెంచి 45ని. చేశారు.

News November 18, 2024

22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు.. ఉత్తర్వులు జారీ

image

TG: మహిళా సంఘాల బలోపేతం కోసం మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల్లో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగతా జిల్లాల్లోనూ నిర్మించనుంది. ఒక్కో భవనానికి రూ.5కోట్లు చొప్పున మొత్తం రూ.110కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు హనుమకొండలో జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

News November 18, 2024

నేను పారిపోలేదు: నటి కస్తూరి

image

తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరిని హైదరాబాద్‌లోని సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎలాంటి భయం లేదని, ఎక్కడికీ పారిపోలేదన్నారు. షూటింగ్ కోసమే HYD వచ్చానని, తన ఫోన్ న్యాయవాదికి ఇచ్చినట్లు చెప్పారు. కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కస్తూరి తెలిపారు.