News September 9, 2024

రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు: హరీశ్

image

TG: MLAల అనర్హత పిటిషన్లపై హైకోర్టు <<14057734>>తీర్పును <<>>స్వాగతిస్తున్నట్లు BRS MLA హరీశ్‌రావు వెల్లడించారు. ‘కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు ఈ తీర్పు చెంప పెట్టు. పార్టీ మారిన MLAలు అనర్హతకు గురికావడం తథ్యం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు ఉంది. అనర్హత వల్ల ఉపఎన్నికలు జరిగే చోట్ల BRSదే గెలుపు. కోర్టు తీర్పును స్పీకర్ 4 వారాల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాం’ అని Xలో ట్వీట్ చేశారు.

Similar News

News October 4, 2024

ఆ దాడులు చట్టబద్ధమైనవే: ఇరాన్ సుప్రీం ఖమేనీ

image

ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల దాడులు చట్టబద్ధమైనవని ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌ ఖమేనీ పేర్కొన్నారు. ఐదేళ్ల త‌రువాత ఆయ‌న బ‌హిరంగ ఉప‌న్యాసం ఇచ్చారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌దిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అఫ్గానిస్థాన్ నుంచి యెమెన్ వరకు, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ వరకు దురాక్ర‌మ‌ణులను తిప్పికొట్టేందుకు ముస్లిం దేశాలు భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేసుకోవాల‌న్నారు.

News October 4, 2024

చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది: జగన్

image

AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.

News October 4, 2024

ఆ మ్యాప్‌ను తొలగించిన ఇజ్రాయెల్

image

జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ భూభాగంగా తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ను ఇజ్రాయెల్ తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో ఇజ్రాయెల్ త‌న అధికార వెబ్‌సైట్ నుంచి దాన్ని తొలగించింది. దీనిపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ‘ఇది వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు. దీన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. మ్యాప్‌ను తొల‌గించాం’ అని తెలిపారు.