News August 17, 2024
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
TG: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు న్యాయ విచారణ ప్రారంభించనుంది. ఇప్పటికే ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. HYDలోని బీఆర్కే భవన్‌లో ఉన్న కమిషన్ కార్యాలయంలో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు సమన్లు జారీ చేసే అవకాశం కన్పిస్తోంది. ఈ విచారణ రెండు వారాల పాటు కొనసాగుతుంది.
Similar News
News January 21, 2025
ఇండియన్ జెర్సీపై పాకిస్థాన్ పేరు ఉంటుందా?
ICC టోర్నీల సమయంలో హోస్ట్ నేషన్ పేరు మిగతా దేశాల జెర్సీలపై ఉంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీపై ఉంచేందుకు భారత్ నిరాకరించినట్లు PCB తెలిపింది. ఈ విషయంలో ICC పాక్‌కు మద్దతు ఇవ్వాలని, జెర్సీపై పేరు పెట్టకపోవడాన్ని సమర్థించవద్దని PCB ప్రతినిధులు కోరారు. అలాగే టోర్నీ ప్రారంభ వేడుకకూ కెప్టెన్ రోహిత్‌ను తమ దేశానికి పంపాలని BCCI అనుకోవడం లేదని చెప్పారు.
News January 21, 2025
POSTER: కొత్త లుక్‌లో రష్మిక
ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఛావా’ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇందులో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్యగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా రష్మిక లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.
News January 21, 2025
నక్సలిజం చివరి దశలో ఉంది: అమిత్ షా
ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఎన్‌కౌంటర్ జరిపిన భద్రతా బలగాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో బలగాలు మరో పెద్ద విజయం సాధించాయన్నారు. ‘నక్సలిజానికి ఇది మరో బలమైన ఎదురుదెబ్బ. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో ఇరు రాష్ట్రాల బలగాలు, CRPF జాయింట్ ఆపరేషన్‌లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. దేశంలో నక్సలిజం ఊపిరులు చివరికి చేరాయి’ అని ట్వీట్ చేశారు.