News August 2, 2024
ఆర్-5 జోన్‌పై న్యాయ పరిశీలన చేస్తున్నాం: నారాయణ

AP: అమరావతిలో వివాదాస్పదమైన ఆర్-5 జోన్‌పై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్షా సమావేశంలో చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్‌పై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా అమరావతిలో R-5 జోన్ ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. స్థానికేతరులకు స్థలాలివ్వడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.
Similar News
News October 14, 2025
ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్: లోకేశ్

విశాఖలో గూగుల్ <<18002028>>పెట్టుబడుల ఒప్పందం<<>> తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
News October 14, 2025
ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్షిప్ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్షిప్ అందిస్తోంది. ఇంటర్లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్సైట్: <
News October 14, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <