News August 2, 2024

ఆర్-5 జోన్‌పై న్యాయ పరిశీలన చేస్తున్నాం: నారాయణ

image

AP: అమరావతిలో వివాదాస్పదమైన ఆర్-5 జోన్‌పై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్షా సమావేశంలో చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్‌పై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా అమరావతిలో R-5 జోన్ ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. స్థానికేతరులకు స్థలాలివ్వడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.

Similar News

News September 17, 2024

MBBS యాజమాన్య కోటా ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2024-25కు గాను యాజమాన్య కోటా(B, C) ఎంబీబీఎస్ సీట్ల ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. 25 కాలేజీల్లో 1,914 సీట్లుండగా, B కేటగిరీలో 1,318, C(ఎన్నారై) కేటగిరిలో 596 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: <>http://drntr.uhsap.in<<>>

News September 17, 2024

ఆత్మవిశ్వాసంలో కోహ్లీకి ఎవరూ సాటిరారు: సర్ఫరాజ్ ఖాన్

image

విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్లకు ఎప్పుడూ అండగా ఉంటూ విలువైన సూచనలు ఇస్తుంటాడని సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసించారు. క్రికెట్ పట్ల ప్యాషన్, ఆత్మవిశ్వాసంలో ఆయనకెవరూ సాటిరారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. IPLలో 2015-18 మధ్య RCB తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే తన కల భవిష్యత్తులో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 17, 2024

న్యూయార్క్‌లో ఆలయం ధ్వంసం.. ఖండించిన భారత కాన్సులేట్

image

న్యూయార్క్‌లోని స్వామినారాయణ్ ఆలయంలో ఓ భాగాన్ని దుండగులు <<14119738>>ధ్వంసం<<>> చేయడాన్ని అక్కడి భారత కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. ఇది హేయమైన చర్య అని మండిపడింది. నిందితులను అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను కోరింది. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. ఇటీవల హిందూ సంఘాలకు బెదిరింపులు వచ్చాయని, ఇప్పుడు దాడి జరిగిందని పేర్కొంది.