News March 29, 2024

రసవత్తరంగా పేట రాజకీయం.. అజ్ఞాతంలో YCP కౌన్సిలర్లు?

image

AP: చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం సాగుతోంది. YCP MLA అభ్యర్థి మనోహర్ నాయుడికి వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు తెలుస్తోంది. ఆయనకు సహకరించేది లేదని 12 మంది కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వీరంతా తొలుత వైసీపీ టికెట్ పొందిన మల్లెల రాజేశ్ నాయుడికి టచ్‌లో ఉన్నట్లు టాక్. రాజేశ్‌తో పాటు వారు టీడీపీలో చేరుతారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Similar News

News February 8, 2026

టమాటాలో కాయ పగుళ్లకు కారణం – నివారణ

image

టమాటా కాయ అభివృద్ధి చెందే దశలో కాయ తొడిమ వైపు, పూత చివరి వైపునకు నిలువు పగుళ్లు కనిపిస్తాయి. నీటి లభ్యతలో తేడాలు, అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం తర్వాత వానలు, బోరాన్ లోపం వల్ల ఈ పగుళ్లు కనిపిస్తాయి. దీని నివారణకు నేలలో తేమ సంరక్షణకు మల్చింగ్ చేపట్టాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకే వాడాలి. పూత, పిందె దశల్లో లీటరు నీటికి డైసోడియం ఆక్టాబోరెట్ 1.25-1.5గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News February 8, 2026

పిల్లలకు రాగిజావ ఎప్పుడివ్వాలంటే?

image

పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే రాగిజావను 6-8 నెలల మధ్యలో పిల్లలకు అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్‌ స్కిల్స్‌ డెవలప్‌ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్‌స్చర్‌నీ గ్రహిస్తారు. తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు.

News February 8, 2026

రోజూ అష్ట చిరంజీవులను తలచుకుంటే?

image

అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమాన్, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడు.. వీరిని అష్ట చిరంజీవులుగా పరిగణిస్తారు. ‘‘అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః’’ అనే మంత్రాన్ని రోజూ స్మరించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఇది అకాల మృత్యువును తొలగించి మానసిక ప్రశాంతతను ఇస్తుందని నమ్మకం.