News July 21, 2024
జులై 21: చరిత్రలో ఈరోజు

1923: నాటకకర్త పోణంగి శ్రీరామ అప్పారావు జననం
1936: రచయిత, మాజీ ఐఏఎస్ జె.బాపురెడ్డి జననం
1966: నటి అనురాధ జననం
2001: పద్మశ్రీ గ్రహీత, నటుడు శివాజీ గణేశన్ మరణం
2009: పద్మవిభూషణ్ గ్రహీత, హిందుస్థానీ గాయని గంగూబాయ్ హంగళ్ మరణం
2013: రచయిత గిడుగు రాజేశ్వరరావు మరణం
Similar News
News February 2, 2026
హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 2, 2026
ఇండియన్ నేవీలో 260 పోస్టులు

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. అర్హులు FEB-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in చూడండి.
News February 2, 2026
రాష్ట్ర ప్రగతికి చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్: పవన్

AP: కేంద్ర బడ్జెట్ ఫలాలు ఏపీ ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగ ప్రోత్సాహకాలు అరకు అభివృద్ధికి, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుందన్నారు. బడ్జెట్‌లో కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో కోనసీమ కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జీడి రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.


