News July 21, 2024

జులై 21: చరిత్రలో ఈరోజు

image

1923: నాటకకర్త పోణంగి శ్రీరామ అప్పారావు జననం
1936: రచయిత, మాజీ ఐఏఎస్ జె.బాపురెడ్డి జననం
1966: నటి అనురాధ జననం
2001: పద్మశ్రీ గ్రహీత, నటుడు శివాజీ గణేశన్ మరణం
2009: పద్మవిభూషణ్ గ్రహీత, హిందుస్థానీ గాయని గంగూబాయ్ హంగళ్ మరణం
2013: రచయిత గిడుగు రాజేశ్వరరావు మరణం

Similar News

News October 12, 2024

సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహినూర్’

image

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహీనూర్’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. ఇవాళ దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో సిద్దూ గెటప్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై పార్ట్-1 అని ఉండటంతో ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

News October 12, 2024

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

image

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇకపై 17 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. మండలం మకరవిళక్కు సీజన్‌ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మ.ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News October 12, 2024

అలియా భట్ కుమార్తెకు రామ్ చరణ్ ‘ఏనుగు గిఫ్ట్’!

image

రామ్ చరణ్‌కు తనకు మధ్య చక్కటి స్నేహం ఉందని అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కుమార్తె రాహా పేరు మీద ఓ అడవి ఏనుగును దత్తత తీసుకుని చెర్రీ దాని ఆలనాపాలనా చూస్తున్నారని ఆమె కొనియాడారు. దత్తతకు సూచనగా ఓ ఏనుగు బొమ్మను రాహాకు గిఫ్ట్‌గా పంపించారని, రాహా రోజూ ఆ ఏనుగుపైకెక్కి ఆడుకుంటుందని వివరించారు. చెర్రీ, అలియా కలిసి RRRలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే.