News July 5, 2024
జులై 5: చరిత్రలో ఈరోజు

1927: నవలా రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1906: తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1978: హీరో కళ్యాణ్ రామ్ జన్మదినం
1995: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు జన్మదినం
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.
Similar News
News December 9, 2025
వంటింటి చిట్కాలు

* పాయసం చేసేటప్పుడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగంటకుండా ఉండాలంటే దానిలో నెయ్యి, కాస్త నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* ఉల్లిపాయలను, బంగాళాదుంపలను విడివిడిగా పెట్టకపోతే తేమ కారణంగా రెండూ పాడవుతాయి.
News December 9, 2025
స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు: రేవంత్

TG: సరిగ్గా ఇదే రోజున 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారన్నారు. ఆ కారణంగానే ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.
News December 9, 2025
ICSILలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL)లో 6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 9 ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in


