News June 15, 2024

జూన్ 15: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: కవి పల్లె పూర్ణప్రజ్ఞాచార్యులు జననం.
✒ 1916: ఆర్థికవేత్త హెర్బర్ట్ సైమన్ జననం.
✒ 1974: సంగీత దర్శకుడు చక్రి జననం.
✒ 1942: స్వాతంత్ర్య సమరయోధుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు మరణం.
✒ 1983: కవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ) మరణం.
✒ 2010: కవి మైనంపాటి వేంకట సుబ్రహ్మణ్యం మరణం.

Similar News

News September 19, 2024

ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రభాస్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా ఇప్పటికే ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

News September 19, 2024

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దుష్ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి

image

AP: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం <<14134836>>వ్యాఖ్యలను<<>> టీటీడీ మాజీ ఛైర్మెన్ సుబ్బారెడ్డి ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని పునరుద్ఘాటించారు. లడ్డూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

News September 19, 2024

ఆ విష‌యంలో మాది కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రే: పాక్‌ మంత్రి

image

JKలో ఆర్టికల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ విష‌యంలో తాము కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రితోనే ఉన్నామంటూ పాక్ రక్ష‌ణ మంత్రి ఖ‌వాజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. JKలో కూట‌మి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆర్టిక‌ల్ 370, 35A పున‌రుద్ధ‌ర‌ణ‌లో వారిది, తమది ఒకే వైఖ‌రి అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎక్క‌డా ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ధ‌రిస్తామ‌ని చెప్ప‌లేదు. NC మాత్రం అమలు చేస్తామంటూ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తుండడం గమనార్హం.