News June 28, 2024

జూన్ 28: చరిత్రలో ఈరోజు

image

1836: అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ మాడిసన్ మరణం
1921: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జననం
1931: రచయిత, దర్శకుడు ముళ్ళపూడి వెంకటరమణ జననం
1983: ఆంధ్ర రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య మరణం
2019: తెలుగు కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మరణం
2022: వ్యాపారవేత్త పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ మరణం
నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే

Similar News

News October 6, 2024

సికింద్రాబాద్ నుంచి గోవా ట్రైన్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే

image

సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. పూర్తి షెడ్యూల్ పై ఫొటోలో చూడండి.

News October 6, 2024

18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

image

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోని రూ.1.61 కోట్లను సీజ్ చేశారు. తెలంగాణలో రూ.6.94 కోట్లు దోచేసిన ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 400కిపైగా కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు, డ్రగ్స్, కొరియర్, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారు

News October 6, 2024

దీపావళికి నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

సుధీర్ వర్మ డైరెక్షన్‌లో నిఖిల్ హీరోగా నటిస్తున్న మూవీ అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఆ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.