News April 10, 2024
ఈ నెల 12న జూనియర్ టోఫెల్ పరీక్షలు

AP: ఈ నెల 12న 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు జూనియర్ టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,104 స్కూళ్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రవేశపెట్టిన టోఫెల్ కోర్సు పరీక్షను 3,4,5 తరగతుల విద్యార్థులకు ఇటీవల నిర్వహించారు. 4.17 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైనట్లు వెల్లడించింది.
Similar News
News March 21, 2025
ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్టార్ బ్యాటర్ దూరం?

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సభ్యుడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపారు. గత సీజన్లో LSG కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ను ఢిల్లీ రూ.14 కోట్లకు వేలంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.
News March 21, 2025
వారి నవ్వు చూసి నాకు సంతోషం కలిగింది: నాగబాబు

AP: శాసనసభ కల్చరల్ ఈవెంట్‌లో CM చంద్రబాబు, Dy.CM పవన్ నవ్వడం చూసి తనకు సంతోషం వేసిందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ‘ఆ రోజు అసెంబ్లీలో గౌరవనీయులైన చంద్రబాబుకు జరిగిన అవమానానికి ఆయన కన్నీరు పెట్టడం ఎంతో బాధించింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యం ఆహ్లాదంగా అనిపించింది. పని ఒత్తిడిలో పవన్ కూడా నవ్వడం చూసి సంతోషం వేసింది’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
తెలుగు కామెంటేటర్స్ సిద్ధం.. మీ ఫేవరెట్ ఎవరు?

స్టేడియంలో ప్లేయర్లు తమ ఆటతో అలరిస్తే, కామెంటేటర్లు తమ మాటలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ ప్యానల్‌ను సిద్ధం చేసింది. గతంలో ‘ఉప్పల్‌లో కొడితే.. తుప్పల్లో పడింది’ అనే డైలాగ్ తెగ వైరలైంది. ఈ ప్యానల్‌లో రాయుడు, MSK ప్రసాద్, శ్రీధర్, హనుమ విహారి, సుమన్, ఆశిశ్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, అక్షత్ రెడ్డి, శశి, కళ్యాణ్, కౌశిక్, హేమంత్, నందు ఉన్నారు.