News November 11, 2024
ఇప్పుడే వచ్చా.. అప్పుడే వణికితే ఎలా?: KTR

TG: మాజీ మంత్రి KTR ఢిల్లీ పర్యటనపై BRS, INC మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ‘అమృత్’ స్కామ్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని KTR అన్నారు. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన హస్తినకు వెళ్లారని మంత్రులు ఆరోపించారు. ఈ కామెంట్స్పై స్పందించిన KTR ‘ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. అప్పుడే HYDలో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పుడే వణికితే ఎలా?’ అని సెటైర్ వేశారు.
Similar News
News September 18, 2025
అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News September 18, 2025
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.
News September 18, 2025
తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,41,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.