News November 11, 2024

ఇప్పుడే వచ్చా.. అప్పుడే వణికితే ఎలా?: KTR

image

TG: మాజీ మంత్రి KTR ఢిల్లీ పర్యటనపై BRS, INC మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ‘అమృత్’ స్కామ్‌లో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని KTR అన్నారు. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన హస్తినకు వెళ్లారని మంత్రులు ఆరోపించారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన KTR ‘ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. అప్పుడే HYDలో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పుడే వణికితే ఎలా?’ అని సెటైర్ వేశారు.

Similar News

News December 5, 2024

‘పుష్ప-2’: పబ్లిక్ టాక్

image

‘పుష్ప-2’ ప్రీమియర్స్ చూసిన అభిమానుల నుంచి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ ఎంట్రీ, ఎలివేషన్లు అదిరిపోయాయని పోస్టులు చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్ బాగున్నాయని కామెంట్లు చేస్తున్నారు. WAY2NEWS రివ్యూ రేపు ఉదయం.

News December 4, 2024

చైతూ-శోభిత పెళ్లి ఫొటోలు

image

నాగచైతన్య-శోభిత వివాహం వైభవంగా జరిగింది. ఆ ఫొటోలను నాగార్జున ట్విటర్‌లో షేర్ చేశారు. వారిద్దరూ కొత్త జీవితం ప్రారంభించడం సంతోషంగా, ఎమోషనల్‌గా ఉందని తెలిపారు. చైకి శుభాకాంక్షలు చెబుతూ తమ ఫ్యామిలీలోకి శోభితకు వెల్‌కమ్ చెప్పారు. ఆమె తమ కుటుంబంలోకి ఆనందాన్ని తీసుకొచ్చారని నాగార్జున రాసుకొచ్చారు. తన తండ్రి ANR శతజయంతి వేడుకల గుర్తుగా ఆయన విగ్రహం ముందే ఈ వివాహం జరగడం మరింత ప్రత్యేకమని వెల్లడించారు.

News December 4, 2024

ఈ నెల 7న మెగా పేరెంట్-టీచర్ మీట్‌

image

AP: ఈ నెల 7న ఉ.9 గంటల నుంచి మ.1 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో మెగా పేరెంట్-టీచర్ మీట్‌ను నిర్వహించనుంది. విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధిపై టీచర్లు, తల్లిదండ్రులు చర్చించనున్నారు. తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయి. సీఎం CBN, మంత్రి లోకేశ్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు.