News March 11, 2025
న్యాయం గెలిచింది: ప్రణయ్ కేసు తీర్పుపై అమృత

ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు <<15710208>>శిక్ష<<>> విధించడంపై అతని భార్య అమృత స్పందించారు. ‘ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం లభించింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నా. ఈ ప్రయాణంలో మద్దతునిచ్చిన పోలీసు శాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు నా ధన్యవాదాలు. నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ప్రెస్ మీట్ నిర్వహించట్లేదు. మమ్మల్ని అర్థం చేసుకోగలరు’ అని పోస్ట్ చేశారు.
Similar News
News September 17, 2025
‘అరబ్-ఇస్లామిక్’ NATO.. భారత్‌కు నష్టమా?

ఖతర్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ దోహాలో 40కి పైగా అరబ్, ఇస్లామిక్ దేశాలు 2 రోజుల క్రితం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా <<7824953>>NATO<<>> తరహాలో అరబ్-ఇస్లామిక్ దేశాల మిలిటరీ అలయన్స్‌కు ఈజిప్ట్ ప్రతిపాదించింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాక్ ఇందుకు మద్దతు తెలిపింది. 180 కోట్ల మంది ముస్లింలు ఇదే కోరుతున్నారని పేర్కొంది. కూటమి ఏర్పాటైతే భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ ఉద్ధృతం చేసే ప్రమాదముంది.
News September 17, 2025
ఒక్క మండలంలోనే 3 వేల బోగస్ పట్టాలు.. ‘భరోసా’ బంద్

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ(D) తిరుమలగిరి(M)లో 3 వేల బోగస్ పట్టాలను అధికారులు గుర్తించి రద్దు చేశారు. ఆయా భూములకు సంబంధించిన అక్రమ లబ్ధిదారులకు రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను నిలిపేశారు. దీనిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామని ప్రకటించారు.
News September 17, 2025
ప్రధానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PM మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’ అని ఆకాంక్షించారు. ‘సరైన సమయంలో సరైన నాయకత్వం దొరకడం మన అదృష్టం. ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేలా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’ అని CM చంద్రబాబు ట్వీట్ చేశారు. Dy.CM పవన్, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్ కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.