News March 11, 2025
న్యాయం గెలిచింది: ప్రణయ్ కేసు తీర్పుపై అమృత

ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు <<15710208>>శిక్ష<<>> విధించడంపై అతని భార్య అమృత స్పందించారు. ‘ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం లభించింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నా. ఈ ప్రయాణంలో మద్దతునిచ్చిన పోలీసు శాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు నా ధన్యవాదాలు. నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ప్రెస్ మీట్ నిర్వహించట్లేదు. మమ్మల్ని అర్థం చేసుకోగలరు’ అని పోస్ట్ చేశారు.
Similar News
News March 27, 2025
కునాల్‌కు మద్దతుగా అభిమానులు..రూ. లక్షల్లో విరాళాలు

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు తన అభిమానుల నుంచి రూ.లక్షల్లో ఆర్థిక సాయం అందుతోంది. విదేశాల నుంచి ఒక అభిమాని రూ.37,000 పంపించిన ఫోటోని ఓ అభిమాని Xలో షేర్ చేశారు. యూట్యూబ్ ‘సూపర్ థాంక్స్’ ఫీచర్ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు. కునాల్‌పై కేసు నమోదైన నేపథ్యంలో లీగల్ ఖర్చుల అవసర నిమిత్తం అభిమానులు డబ్బు పంపిస్తున్నారు. DY.cm ఏక్‌నాథ్ శిండేపై కామెడీ స్కిట్ చేసినందుకు కునాల్ పై కేసు నమోదైంది.
News March 27, 2025
హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

AP: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మండిపడ్డారు. ‘ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కార్‌కు లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.
News March 27, 2025
శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

AP: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక అలంకరణలు, వాహన సేవ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉత్సవ మూర్తులకు రాత్రి 7గం. గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి.