News November 11, 2024

CJIగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా

image

భారత సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎలక్టోరల్ బాండ్స్, ఆర్టికల్ 370 వంటి కేసుల్లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక తీర్పులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పదవీకాలం నవంబర్ 10న ముగిసింది.

Similar News

News January 31, 2026

బడ్జెట్ 2026: వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

image

యూనియన్ బడ్జెట్ 2026పై ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచారు. ముఖ్యంగా సిల్వర్‌పై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే దేశీయంగా ధరలు తగ్గి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, దిగుమతులను తగ్గించడం కోసం డ్యూటీ పెంచే అవకాశాలూ ఉన్నాయి. అటు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వాడకం ఎక్కువ కాబట్టి ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలు పారిశ్రామికంగా వెండికి మంచి బూస్ట్ ఇస్తాయి.

News January 31, 2026

‘జన నాయగన్’ వివాదంపై స్పందించిన విజయ్

image

‘జన నాయగన్’ వాయిదాపై హీరో, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తన సినిమాపై రాజకీయ ప్రభావం ఉంటుందని ముందే ఊహించానన్నారు. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నిర్మాతల గురించే బాధగా ఉందని, తన కారణంగా వాళ్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. JAN 9న రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆలస్యంతో వాయిదా పడింది.

News January 31, 2026

పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5 లక్షల వరకు ఉచిత వైద్యం: CBN

image

AP: P4 కింద 500-700 ఫ్యామిలీలను క్లస్టర్‌గా చేస్తే మార్పు వస్తుందని CM చంద్రబాబు సూచించారు. కుప్పంలోని పీ4 బంగారు కుటుంబాలు-మార్గదర్శులతో CM భేటీ అయ్యారు. ‘కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అక్షరాస్యత పెంచాలి. రాష్ట్రంలో త్వరలోనే పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ₹2.5L వరకూ ఉచిత వైద్యం అందిస్తాం’ అని చెప్పారు. కుప్పంలోని 3 మండలాలను దత్తత తీసుకున్న MEIL, ADANI, TVS సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.