News November 11, 2024

CJIగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా

image

భారత సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎలక్టోరల్ బాండ్స్, ఆర్టికల్ 370 వంటి కేసుల్లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక తీర్పులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పదవీకాలం నవంబర్ 10న ముగిసింది.

Similar News

News December 2, 2024

గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు: హెడ్ ప్రశంసలు

image

AUS స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ IND స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. BGT తొలి టెస్టులో 89 పరుగులు చేసిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేయగా అప్పటి నుంచి దీనిపై ఆయన స్పందించలేదు. తాజాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హెడ్ స్పందిస్తూ.. ‘నేను ఆడిన గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నానని నా మనవళ్లతో చెప్పడం కూడా బాగుంటుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

News December 2, 2024

పదవులపై ఆశ లేదు: శిండే కుమారుడు

image

తాను డిప్యూటీ సీఎం అవుతాననే ప్రచారంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే కుమారుడు శ్రీకాంత్ శిండే స్పందించారు. ఆ రేసులో లేనని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ వచ్చినా తీసుకోలేదు. పార్టీ కోసం పనిచేయడానికే కట్టుబడి ఉన్నా’ అని శ్రీకాంత్ వెల్లడించారు.

News December 2, 2024

ఎల్లుండి పెళ్లి.. ప్రీవెడ్డింగ్ ఫొటోలు చూశారా?

image

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పెళ్లికి ముందు తంతు ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. తాజాగా శోభితను పెళ్లి కూతురు చేయగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నిర్వాహకులు షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో ఎల్లుండి వివాహం జరగనుంది.