News December 18, 2024
కొలీజియం ముందు హాజరైన జస్టిస్ శేఖర్
అలహాబాద్ HC జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ Tue సుప్రీంకోర్టు కొలీజియం ముందు హాజరయ్యారు. Dec 8న VHP ప్రొగ్రాంలో పాల్గొన్న ఆయన ‘అసమాన న్యాయ వ్యవస్థలను యూనిఫాం సివిల్ కోడ్ తొలగిస్తుంది’ అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అవ్వడంతో సుప్రీంకోర్టు వివరణ కోరింది. నిబంధనల ప్రకారం వివాదాలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు కొలీజియం ముందు తమ వాదన వినిపించే అవకాశం ఉండడంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
Similar News
News January 24, 2025
ట్రంప్‌నకు షాక్.. జన్మత: పౌరసత్వం రద్దు నిర్ణయం నిలిపివేత
USAలో జన్మత: వచ్చే <<15211801>>పౌరసత్వాన్ని<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌నకు షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులకెక్కిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆర్డర్ ప్రకారం USAకు వలస వెళ్లిన వారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు.
News January 24, 2025
విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి
TG: వేసవిలో పీక్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజా భవన్లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 108 తరహాలో విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుకు 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
News January 24, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 24, శుక్రవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.