News March 19, 2024
ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టుకు కేఏ పాల్!

AP: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు. ఎన్నికలకు, లెక్కింపునకు మధ్య 21 రోజుల గ్యాప్ ఉందని, ఈవీఎం ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాల్ వాదనలు విన్న కోర్టు, తగిన నిర్ణయాన్ని వెలువరించాలని సూచిస్తూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.
Similar News
News March 2, 2026
ఖమేనీ అధీనంలో రూ.8.55లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సుమారు $95B (₹8.55లక్షల కోట్లు) విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తొలి సుప్రీం లీడర్ ఖొమేనీ స్థాపించిన ‘సెటాడ్’ అనే రహస్య సంస్థ పరిధిలో ఇది ఉందని పేర్కొంది. ప్రజల ఆస్తులను జప్తు చేసి విక్రయించేవారని, ప్రతి రంగంలో ‘సెటాడ్’కి వాటాలున్నాయని ఆరోపించింది. అయితే ఖమేనీ తాను రిచ్ అయ్యేందుకు సెటాడ్‌ను వాడుకున్నారనేందుకు ఆధారాల్లేవని పేర్కొంది.
News March 2, 2026
చనిపోయిన ఖమేనీ మనుమరాలు ఈ పాపనే..

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఆయన కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా <<19281898>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. తాజాగా 14 నెలల మనుమరాలు జహ్రా మొహమ్మది ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పసిప్రాయంలో ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అత్యంత భద్రత ఉండే ఖమేనీ గృహసముదాయంపై ఏకంగా 30 శక్తిమంతమైన బాంబులను పేల్చి హతమార్చారు.
News March 2, 2026
యువవికాసం: 16.5L అప్లికేషన్లకు ఇచ్చింది జీరో

TG: యువతకు ఆర్థిక సాయం కోసం GOVT రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. దీనికి 2025-26 బడ్జెట్లో ₹6వేల CRను కేటాయించింది. ₹4 లక్షలు సబ్సిడీగా అందే ఈ పథకం కోసం 16.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత JUN 2న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరగాలి. కానీ చివరి నిమిషంలో ఆర్థిక శాఖ నిధులు లేవనడంతో జరగలేదు. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? ఇచ్చినా అమలు చేస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


