News March 19, 2024

ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టుకు కేఏ పాల్!

image

AP: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు. ఎన్నికలకు, లెక్కింపునకు మధ్య 21 రోజుల గ్యాప్ ఉందని, ఈవీఎం ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాల్ వాదనలు విన్న కోర్టు, తగిన నిర్ణయాన్ని వెలువరించాలని సూచిస్తూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.

Similar News

News September 21, 2024

తిన్న వెంటనే మళ్లీ ఆకలి అవుతోందా?

image

తిన్న వెంటనే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందంటే దాని వెనుక నిర్దిష్ట కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొన్ని వ్యాధుల వల్ల ఇలా అనిపిస్తుందని చెబుతున్నారు. యాంటీ సైకోటిక్ మందులు, స్టెరాయిడ్లు వాడినా, రాత్రి పూట నిద్రలేకపోయినా, ఒత్తిడికి గురైనా, మధుమేహం ఉన్నా శరీరం ఎక్కువ ఆహారం కోరుకుంటుంది. అలాగే సెక్స్ హార్మోన్లలో మార్పులు, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినా, కార్టిసాల్ పెరిగినా ఆహార కోరికలు పెరుగుతాయి.

News September 21, 2024

భారీ వర్షాలు.. 1,15,151 హెక్టార్లలో పంట నష్టం

image

AP: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 1,15,151 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం ప్రకటించిన <<14129018>>పరిహారం<<>> ప్రకారం 1,86,576 మంది రైతులకు రూ.278.49కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. 1,12,721 కోళ్లు, 564 పాలిచ్చే పశువులు, 719 మేకలు, గొర్రెలు, 207 ఇతర పశువులు మృత్యువాతపడినట్లు గుర్తించారు. వీటికి పరిహారంగా రూ.3.14కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు.

News September 21, 2024

జానీ మాస్టర్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టనున్న బాధితులు?

image

మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన నేపథ్యంలో ఆయన బాధితులు మరింత మంది బయటికి రానున్నట్లు సమాచారం. జానీ చేసిన పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు షాకింగ్ విషయాలు వెల్లడించనున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఆయన చాలా మంది మహిళా అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. కాగా నిందితుడు జానీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.