News March 28, 2024
కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి?

TG: BRSలో భారీ కుదుపు. ఇన్నాళ్లూ ఆ పార్టీ టికెట్ కోసం పోటీ పడిన నేతలు ఇప్పుడు మాకొద్దు మొర్రో అంటున్నారు. తాజాగా వరంగల్ BRS ఎంపీ టికెట్‌ను కడియం శ్రీహరి కూతురు కావ్య వదులుకున్నారు. దీంతో శ్రీహరి, కావ్య కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ కాంగ్రెస్ MP అభ్యర్థిగా కావ్య బరిలోకి దిగుతారని చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా వరంగల్‌లో INC ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
Similar News
News February 18, 2026
టెన్త్ విద్యార్థులకు అప్పటి వరకు ఛాన్స్

AP: టెన్త్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షల తర్వాత కూడా పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీల్లో మార్పులు చేసుకోవచ్చు. హాల్ టికెట్లలో తప్పులుంటే ఆందోళన వద్దని, ఫైనల్ మెమోలు వచ్చేవరకు మార్పులకు ఛాన్స్ ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ KV శ్రీనివాసులు చెప్పారు. UDISE+ పోర్టల్‌లో MAR 31 నుంచి ఈ ఛేంజెస్ చేసుకోవచ్చన్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లో హాల్ టికెట్లు రిలీజ్ కానుండగా MAR 16-APR 1 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.
News February 18, 2026
రోజూ హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారా?

హ్యాండ్ బ్యాగ్ కొందరికి అవసరం. కానీ దాంట్లో అనవసరమైన వస్తువులు పెట్టి దాన్ని బరువుగా మారుస్తున్నారు చాలామంది. దాన్ని స్టైల్‌గా చేత్తో పట్టుకోవడమో, భుజానికి వేసుకోవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో కండరాలు, ఎముకలపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు పోశ్చర్ మారిపోతుంది. కాబట్టి బ్యాగును చేతులు మారుస్తూ పట్టుకోవడం, లగేజ్ ఎక్కువగా ఉంటే బ్యాక్ ప్యాక్ వాడటం మంచిదని సూచిస్తున్నారు.
News February 18, 2026
YouTube డౌన్

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.


