News June 28, 2024
ఓటీటీలోకి కాజల్ ‘సత్యభామ’

ఇటీవల థియేటర్లలో విడుదలైన కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో మూవీ స్ట్రీమ్ అవుతోంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కాజల్ ప్రధాన పాత్రధారిగా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో సత్యభామను సుమన్ చిక్కాల తెరకెక్కించారు. చాలాకాలంగా హీరోల సరసన కథానాయికగా చేస్తూ వచ్చిన కాజల్‌కు ఇదే తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కావడం గమనార్హం.
Similar News
News January 8, 2026
పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.
News January 8, 2026
ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఉపయోగాలు

తొమ్మిది నెలల ప్రయాణంలో శిశువు ఎదుగుదల సజావుగా ఉంటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. కడుపులో బిడ్డ సౌకర్యంగా సాగడానికి ఉమ్మనీరు చాలా అవసరం. ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఒత్తిడి, దెబ్బతగిలినా ఏం కాకుండా కాపాడుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, బేబీ తక్కువ మూత్రం పోవడంతో ఉమ్మనీరు తగ్గుతుంది. ఇలాంటి వారికి అవసరమైతే తొందరగా ప్రసవం చేయాల్సి రావొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
News January 8, 2026
జిల్లా కేంద్రం మార్పుపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

AP: అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే అంశంలో స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంది. గతంలో ఓ మండలం మార్పులో హైకోర్టు జోక్యం చేసుకోగా సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. జిల్లా కేంద్రం మార్పును సవాల్ చేస్తూ ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.


