News June 28, 2024

ఓటీటీలోకి కాజల్ ‘సత్యభామ’

image

ఇటీవల థియేటర్లలో విడుదలైన కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో మూవీ స్ట్రీమ్ అవుతోంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కాజల్ ప్రధాన పాత్రధారిగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో సత్యభామను సుమన్ చిక్కాల తెరకెక్కించారు. చాలాకాలంగా హీరోల సరసన కథానాయికగా చేస్తూ వచ్చిన కాజల్‌కు ఇదే తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కావడం గమనార్హం.

Similar News

News December 13, 2024

నేడు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరం దాటింది. కాగా, ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొంది. అటు, అల్పపీడనం తీరం దాటిన సందర్భంగా TNలో భారీ వర్షాలు పడుతున్నాయి.

News December 13, 2024

స్టాక్ మార్కెట్లు విలవిల.. RS 2.5L CR నష్టం

image

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 24,389 (-156), సెన్సెక్స్ 80,742 (-540) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.2.5లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT, ఫార్మా, మెటల్, కమోడిటీస్, ఎనర్జీ రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. టాటా స్టీల్, JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, INDUSIND టాప్ లూజర్స్. AIRTEL, ADANIENT టాప్ గెయినర్స్.

News December 13, 2024

పింఛన్‌తో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్

image

తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ తెలిపారు. తనకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారు. ‘యూరిన్ సమస్యతో బాధపడుతున్నా. నా కుటుంబం సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. గతంలో రెండు సర్జరీలకు సచిన్ సహాయం చేశారు. కపిల్ దేవ్ ఆఫర్ మేరకు నేను రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.