News September 10, 2024

KKR మెంటార్‌గా కలిస్?

image

కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్‌ను నియమించాలని ఆ ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అతడితోపాటు కుమార సంగక్కర, రికీ పాంటింగ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా కోల్‌కతాతో కలిస్‌కు మంచి అనుబంధం ఉంది. గంభీర్ సారథ్యంలో KKRకు రెండేళ్లు ఆడారు. ఆ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గానూ సేవలందించారు. అందుకే ఆయన వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 25, 2025

రామ్, నేను ఒకే రాశిలో పుట్టాం: భాగ్యశ్రీబోర్సే

image

తాను కలిసి నటించిన హీరోల్లో రామ్‌తో వైబ్ కుదిరిందని హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే అన్నారు. తమ ఇద్దరిది ఒకే రాశి(వృషభం) అని చెప్పారు. ‘నటిగా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ‘కాంత’ మూవీలో రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతా. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి ట్రెక్కింగ్‌కు వెళ్తా’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈ నెల 27న రిలీజ్ కానుంది.

News November 25, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 25, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 25, 2025

మెదక్: మహిళలకు గుడ్ న్యూస్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాలలో ఆర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలకింద రూ.8కోట్ల 80లక్షల వడ్డీని బ్యాంకు లీంకేజీపై మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.