News September 10, 2024
KKR మెంటార్‌గా కలిస్?

కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్‌ను నియమించాలని ఆ ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అతడితోపాటు కుమార సంగక్కర, రికీ పాంటింగ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా కోల్‌కతాతో కలిస్‌కు మంచి అనుబంధం ఉంది. గంభీర్ సారథ్యంలో KKRకు రెండేళ్లు ఆడారు. ఆ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గానూ సేవలందించారు. అందుకే ఆయన వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 13, 2026
ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News April 13, 2026
ఇంటర్ రిజల్ట్స్.. మార్క్ మెమోలో తప్పులున్నాయా?

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మెమోలో ఏవైనా తప్పులుంటే 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్(helpdesk-ie@telangana.gov.in)కు కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇక ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతిబాఫూలే స్టూడెంట్స్ 90% ఉత్తీర్ణత సాధించారు.
News April 13, 2026
కుప్పకూలిన మార్కెట్లు.. నిమిషాల్లో రూ.8లక్షల కోట్లు హాంఫట్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,624 పాయింట్లు, నిఫ్టీ 476 పాయింట్లు కోల్పోయాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. యుద్ధంపై పీస్ టాక్స్, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో గతవారం మార్కెట్లు 6% వృద్ధి సాధించాయి. కానీ చర్చలు విఫలమవడం, క్రూడాయిల్ ధర పెరగడంతో మళ్లీ నష్టాల బాట పట్టాయి.


