News January 15, 2025
‘కల్కి-2’ రిలీజ్ అయ్యేది అప్పుడే: అశ్వనీదత్

‘కల్కి-2’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. సీక్వెల్లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకూ ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని ప్రశంసించారు.
Similar News
News October 27, 2025
రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేదాన్ని: నటి ధన్య

కండీషన్లు పెట్టుకోవడం వల్లే తాను ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి ఎదగలేకపోయానని నటి ధన్య బాలకృష్ణన్ అన్నారు. రొమాంటిక్ సీన్లు చేయొద్దనే కండీషన్ పెట్టుకోవడంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ఆ సీన్లు చేసి ఉంటే మంచి పొజీషన్లో ఉండేదాన్ని అని పేర్కొన్నారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు. ఆమె నటించిన ‘కృష్ణలీల’ NOV 7న రిలీజ్ కానుంది.
News October 27, 2025
ఈ జిల్లాల్లో కాలేజీలకు సెలవు

AP: తుఫాను నేపథ్యంలో స్కూళ్లతో పాటు పలు జిల్లాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉండనుంది. కాకినాడలో 31 వరకు సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు నడవనున్నాయి.
News October 27, 2025
₹5500 కోట్ల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

‘ఆత్మనిర్భరత్’ సాధనలో ₹5500 కోట్లతో చేపట్టే 7 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి వల్ల రానున్న కాలంలో రూ.20వేల కోట్లమేర దిగుమతి వ్యయం తగ్గుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. Kaynes Syrmaతోపాటు మరో మూడు గ్రూపులు రూ.వేల పెట్టుబడులతో ముందుకొచ్చాయన్నారు. కాగా ₹1.15 లక్షల కోట్లతో ప్రతిపాదనలు అందినట్లు ఎలక్ట్రానిక్స్ & IT కార్యదర్శి కృష్ణన్ తెలిపారు.


