News January 15, 2025

‘కల్కి-2’ రిలీజ్ అయ్యేది అప్పుడే: అశ్వనీదత్

image

‘కల్కి-2’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకూ ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని ప్రశంసించారు.

Similar News

News February 18, 2025

భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్

image

భారత్-పాక్ సరిహద్దుల్లోని పీర్‌పంజల్ ప్రాంతంలో(J&K) నియంత్రణ రేఖ(LOC) వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడమే దీనిక్కారణం. సరిహద్దు ఆవలి నుంచి కాల్పులు జరుపుతూ భారత బలగాల్ని రెచ్చగొట్టేందుకు పాక్ యత్నిస్తోంది. మరోవైపు.. సీజ్‌ఫైర్ ఉల్లంఘన జరగలేదని, అధికారికంగా అమల్లోనే ఉందని భారత్ చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.

News February 18, 2025

నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

image

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.

News February 18, 2025

నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.

error: Content is protected !!