News May 4, 2024

‘కల్కి 2898 ఏడీ’ ప్రీ బిజినెస్ రూ.700 కోట్లు!

image

భారీ అంచనాలతో వస్తోన్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఏకంగా రూ.700కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు డిజిటల్ రైట్స్ సైతం ఓ రేంజ్‌లో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.200 కోట్లకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Similar News

News November 27, 2025

RECORD: వికెట్ కోల్పోకుండా 177 రన్స్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. ఒడిశాతో మ్యాచులో వికెట్ కోల్పోకుండా 177 రన్స్ చేశారు. రోహన్ 60 బంతుల్లో 10 సిక్సులు, 10 ఫోర్లతో 121*, సంజూ 41 బంతుల్లో 51* పరుగులు బాదారు. ఈ టోర్నీ హిస్టరీలో ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. ఈ మ్యాచులో తొలుత ఒడిశా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేయగా, కేరళ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

News November 27, 2025

ఫైబర్ ఎంత తీసుకోవాలంటే..

image

మన శరీరానికి పీచు తగిన మొత్తంలో అందితేనే ఆకలి, ట్రైగ్లిజరాయిడ్స్‌ అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువ. దంపుడు బియ్యం, గోధుమ, జొన్న, సజ్జ రవ్వలు, ఓట్స్, రాజ్మా, శనగల నుంచి ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజులో 25-48గ్రా. వరకూ పీచు కావాలి. ఎత్తు, బరువు, అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు.

News November 27, 2025

ముంపును తట్టుకొని అధిక దిగుబడి అందించిన వరి రకాలు

image

ఇటీవల మెుంథా తుఫానుకు వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. కానీ ఈ తీవ్ర తుఫాన్‌ను ఎదుర్కొని మంచి దిగుబడినిచ్చాయి R.G.L- 7034, M.T.U-1232 వరి రకాలు. తీవ్ర గాలులు, వరద ముంపు, అనంతర చీడపీడలను తట్టుకొని ఈ 2 వరి రకాలు ఆశించిన దిగుబడినిచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తక్కువ ఎరువుల మోతాదుతో అధిక దిగుబడినిచ్చే ఈ వరి వంగడాల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.