News May 4, 2024

‘కల్కి 2898 ఏడీ’ ప్రీ బిజినెస్ రూ.700 కోట్లు!

image

భారీ అంచనాలతో వస్తోన్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఏకంగా రూ.700కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు డిజిటల్ రైట్స్ సైతం ఓ రేంజ్‌లో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.200 కోట్లకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Similar News

News November 19, 2025

హోటల్‌ రూమ్‌లకు భలే డిమాండ్‌

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.

News November 19, 2025

మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

image

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.

News November 19, 2025

కొత్తగూడెం: సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులందరూ రూ.లక్ష ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గతంలో మెయిన్స్‌కు ఎంపికై రూ.లక్ష ప్రోత్సాహకం పొందిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.