News June 28, 2024

‘కల్కి’ బ్లాక్ బస్టర్.. నిర్మాత ట్వీట్ వైరల్

image

‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వేళ నిర్మాత స్వప్న దత్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నాకు కాల్ చేసి రికార్డ్స్ క్రాస్ చేశామా అని చాలా మంది అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్లెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీశాం’ అని ఆమె పోస్ట్ చేశారు. ‘కల్కి’ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News October 13, 2024

బాహుబలి-2ను దాటేసిన దేవర

image

తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును ఎన్టీఆర్ ‘దేవర’ దాటేసింది. 16వ రోజున రూ.3.65కోట్లు వసూలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్(రూ.3.21కోట్లు), RRR (రూ.3.10కోట్లు), F2(రూ.2.56 కోట్లు) ఉన్నాయి. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

News October 13, 2024

ఉపాధి హామీ పనుల ప్రభావంపై అధ్యయనం

image

క్షేత్ర‌స్థాయిలో ఉపాధి హామీ ప‌థకం ప‌నితీరు, దాని ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయ‌నానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ ద‌శ‌ల్లో క‌న్స‌ల్టెంట్ల‌ను ఎంపిక చేస్తారు. క్షేత్ర‌స్థాయిలో ఇంటింటి స‌ర్వే ద్వారా గ‌త ఐదు ఆర్థిక సంవత్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల ప్ర‌భావంపై క‌న్స‌ల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

News October 13, 2024

2025లో మెగా అభిమానులకు పండుగే పండుగ!

image

2025 మెగా అభిమానులకు కనుల పండుగ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సినిమాలు నెలల వ్యవధిలో రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. జనవరి 10న చెర్రీ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, చిరు విశ్వంభర కూడా ఏప్రిల్‌లో రిలీజయ్యే ఛాన్సుంది.