News September 2, 2024
ఏపీకి విరాళం ప్రకటించిన ‘కల్కి’ నిర్మాణ సంస్థ
ఏపీలో భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ డబ్బులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ క్లిష్ట సమయాల్లో అండగా ఉండటం తమ కర్తవ్యమని తెలిపింది. ఒకరికొకరు కలిసికట్టుగా ఉండాలని రాసుకొచ్చింది. ‘రేపటి కోసం’ అంటూ కల్కి డైలాగ్‌ను షేర్ చేసింది.
Similar News
News September 10, 2024
ట్రంప్ ఓడితే.. అమెరికన్లకు మస్క్ హెచ్చరిక
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ఇవే ఆఖరి అసలు సిసలైన ఎన్నికలు అవుతాయని బిలియనీర్ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. కోటిన్నర మంది అక్రమ వలసదారుల్ని సక్రమం చేసేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరింత మందిని తీసుకొచ్చి వారు స్వింగ్ స్టేట్స్ గెలిచి అమెరికాను ఏకపార్టీ రాజ్యంగా మార్చేస్తారని తెలిపారు. 1986 ఆమ్నెస్టీ సంస్కరణలతో కాలిఫోర్నియా ఇలాగే మారిందని గుర్తుచేశారు.
News September 10, 2024
రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: భట్టి విక్రమార్క
TG: రాష్ట్రంలో ఏటా రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన రాష్ట్ర పథకాలపై వివరించారు. అక్షరాస్యత పెంపునకు రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామన్నారు. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
News September 10, 2024
4 PHOTOS: విలయం తర్వాత విజయవాడ
AP: ఇటీవల వచ్చిన భారీ వరదలతో విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు వరద తగ్గిపోవడంతో ఇన్ని రోజులు నీటిలో మునిగిపోయిన వస్తువులు, వాహనాలు బురద పూసుకొని తేలాయి. ఎంతో మంది సామాన్యుల ఇళ్లలోని సామగ్రి, పుస్తకాలు, చిన్న చిన్న షాపుల్లోని వస్తువులు పూర్తిగా పాడైపోయాయి. వరదలు విజయవాడకు ఎంతలా గాయం చేశాయో పై ఫొటోల్లో చూసి అర్థం చేసుకోవచ్చు. PHOTOS – BBC