News June 23, 2024
‘కల్కి’.. రాజశేఖర్ మూవీకి టికెట్లు బుక్ అయ్యాయ్!
బుక్ మై షోలో ‘కల్కి2898AD’ టికెట్లు బుక్ చేసుకుంటున్నవారికి చేదు అనుభవం ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సెర్చ్‌లో ‘కల్కి’ అని టైప్ చేయగానే ‘కల్కి2898AD’, రాజశేఖర్ నటించిన ‘కల్కి’ పేర్లు కనిపిస్తున్నాయి. ఆత్రుతలో రాజశేఖర్ మూవీకి బుక్ చేసుకున్నట్లు కొందరు Xలో వాపోతున్నారు. బుక్ మై షోకు ఫిర్యాదు చేయగా.. ఆందోళన చెందొద్దని, ప్రభాస్ మూవీకే బుక్ అయినట్లు చెప్పింది. తర్వాత రాజశేఖర్ కల్కిని తొలగించింది.
Similar News
News November 11, 2024
ALERT: 3 రోజులు భారీ వర్షాలు
AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDM తెలిపింది. రేపు ఈ <<14585013>>జిల్లాల్లో<<>> వర్షాలు కురవనుండగా ఎల్లుండి అల్లూరి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూల్, నంద్యాలలో వానలు పడతాయని పేర్కొంది. 14న కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.
News November 11, 2024
ఏపీలో బీసీ కులాలపై ప్రభుత్వం ప్రకటన
AP: రాష్ట్రంలో మొత్తం 138 బీసీ కులాలు ఉన్నాయని, వీటిని 5 గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. BC-Aలో 51, BC-Bలో 27 కులాలు, BC-Cలో ఒక కులం, BC-Dలో 45, BC-Eలో 14 కులాలు ఉన్నట్లు తెలిపింది. క్రిస్టియన్లుగా మతం మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వారు BC-Cలోకి వస్తారని, ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని BC-Eలుగా గుర్తించినట్లు పేర్కొంది.
News November 11, 2024
నటితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తెలుగు డైరెక్టర్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇవాళ వీరి నిశ్చితార్థం జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. సందీప్ రాజ్ ‘కలర్ ఫోటో’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.