News March 17, 2024
‘కల్కి’ రిలీజ్ వాయిదా?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ప్రకటించిన మే 9న ఈ సినిమాను విడుదల చేయటం లేదని సమాచారం. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. ఎన్నికలకు 4 రోజుల ముందుగా విడుదల చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నట్లు టాక్.
Similar News
News March 10, 2026
రజినీ-కమల్ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ మూవీ <<19199837>>ప్రోమో<<>> ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
News March 10, 2026
ట్రంప్ కామెంట్స్.. తగ్గిన క్రూడాయిల్ ధర

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ముగుస్తుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన <<19341728>>వ్యాఖ్యలతో<<>> క్రూడాయిల్ ధర తగ్గింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $88కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 23% తగ్గింది. ఆయిల్ ధరలను నియంత్రించేందుకు ట్రంప్ అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు అంతకుముందు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆయిల్ ధరలు 50% పెరిగాయి.
News March 10, 2026
ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయింది: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని US ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసేందుకు 4-5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే పూర్తి కాబోతున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఏవీ లేవని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్ కాల్‌లో చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.


