News March 17, 2024
‘కల్కి’ రిలీజ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ప్రకటించిన మే 9న ఈ సినిమాను విడుదల చేయటం లేదని సమాచారం. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. ఎన్నికలకు 4 రోజుల ముందుగా విడుదల చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నట్లు టాక్.
Similar News
News December 7, 2024
బంగ్లాలో మరో 2 ఆలయాల ధ్వంసం
బంగ్లాదేశ్‌లోని ఢాకా జిల్లాలో మరో రెండు గుళ్లను అక్కడి దుండగులు తగలబెట్టినట్లు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు. ‘ఈరోజు తెల్లవారుజాము 2-3 గంటల మధ్య సమయంలో రాధాకృష్ణ ఆలయం, మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలకు నిప్పుపెట్టారు. లక్ష్మీనారాయణుల విగ్రహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆలయాలను, హిందువుల్ని కాపాడేందుకు అక్కడి పోలీసులు, ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News December 7, 2024
నాలుగు రోజుల వ్యవధిలో 2 సార్లు కంపించిన భూమి
TG: రాష్ట్రంలో భూప్రకంపనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 4న ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలలో ఈ స్థాయిలో కంపించడం ఇదే తొలిసారి. తాజాగా మహబూబ్‌నగర్‌లో భూమి కంపించడం ప్రజల్లో భయాన్ని తీవ్రం చేస్తోంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెబుతున్నారు.
News December 7, 2024
నితీశ్ కుమార్‌లో మొదలైన టెన్షన్
మహారాష్ట్ర పరిణామాలు బిహార్ CM నితీశ్‌ను టెన్షన్ పెడుతున్నాయి. శిండే నాయకత్వంలోనే మహాయుతి ఎన్నికల్ని ఎదుర్కొన్నా మెజారిటీ సీట్లు గెలిచిన BJP CM పదవిని అంటిపెట్టుకుంది. ఇదే కోవలో ప్రస్తుతం బిహార్‌లో JDU కంటే BJP MLAల బలం అధికం. ఈ ప్రాతిపదికన 2025లో బీజేపీ గనుక అత్యధిక సీట్లు తీసుకొని, ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలిస్తే తన పరిస్థితి ఏంటని నితీశ్ టెన్షన్ పడుతున్నారు.