News January 14, 2025
రెండు రాష్ట్రాలకు రేపు ‘కల్లక్కడల్’ ముప్పు: INCOIS

కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్(సముద్రంలో ఆకస్మిక మార్పులు) ముప్పు పొంచి ఉందని కేంద్ర సంస్థ INCOIS హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా రేపు రా.11.30 వరకు అలలు 1 మీటర్ వరకు ఎగిసి పడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టారు. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పర్యాటకులు బీచ్‌లకు వెళ్లొద్దని సూచించింది.
Similar News
News February 17, 2025
RECORD: 84 ఏళ్ల కాపురం.. 100+ గ్రాండ్ చిల్డ్రన్

దాంపత్యంలో చిన్న విభేదాలకే విడిపోతున్న ఈ రోజుల్లో 84ఏళ్ల తమ కాపురంతో రికార్డు సృష్టించిన ఓ జంట అందరికీ స్ఫూర్తినిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన మనోయిల్(105), మరియా(101)కు 1940లో పెళ్లయ్యింది. వీరు 13మంది పిల్లలు, 55మంది మనవళ్లు, మనవరాళ్లు, 54మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, 12మంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్‌ను చూశారు. ఒకరిపై ఒకరికి గల ప్రేమ, నమ్మకం వల్లే అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.
News February 17, 2025
GBSపై ప్రజలకు అవగాహన కల్పించండి: మంత్రి

AP: GBS అంటు వ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. ఇవాళ గుంటూరులో జీజీహెచ్‌లో ఓ మహిళ GBSతో మరణించడంపై ఆయన స్పందించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి <<15225307>>లక్షణాలు<<>> కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.
News February 17, 2025
మరో 112 మందితో భారత్ చేరుకున్న US ఫ్లైట్

అక్రమంగా ప్రవేశించారని కొందరు భారతీయులను అమెరికా స్వదేశానికి పంపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా US నుంచి అమృత్‌సర్‌కు 3వ సైనిక విమానం కొద్దిసేపటి కిందటే చేరుకుంది. ఇందులో 112 మంది వివిధ రాష్ట్రాల వాసులున్నారు. ఇప్పటికే 2 విమానాల్లో US అక్రమ వలసదారులను వెనక్కి పంపింది. మరోవైపు, ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారని పంజాబ్ CM కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.