News November 9, 2024

కల్వకుర్తి-మాచర్ల రైల్వే లైన్ కావాలి: రవి

image

ఏపీ-తెలంగాణలను అనుసంధానించేలా కల్వకుర్తి-మాచర్ల రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి SCR GM అరుణ్‌కుమార్‌ను కోరారు. డోర్నకల్ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ వరకు నూతన రైల్వే లైన్ సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన జడ్చర్ల-నాగర్‌కర్నూల్-కల్హాపూర్-నంద్యాల వరకు రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని లేఖ ఇచ్చారు.

Similar News

News December 9, 2024

రూపం ఏదైనా తెలంగాణ తల్లి ప్రతిరూపమే: విజయశాంతి

image

TG: రూపం ఏదైనా బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతస్మరణీయం అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అమ్మోరు తల్లి లెక్క నూరు రూపాలైనా, ఏ రూపంలో ఉన్నా మన తెలంగాణ తల్లి ప్రతిరూపమే అని చెప్పారు. నిర్బంధాలను దాటుకొని 2007లో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అయిందన్నారు. ఆ తర్వాత BRS, ఇప్పుడు కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి ప్రతిరూపమే అన్నారు.

News December 9, 2024

రష్యా చేరుకున్న సిరియా అధ్యక్షుడు

image

సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అసద్‌ దేశాన్ని వీడారు. కాగా, ఆయన విమానాన్ని రెబల్స్ కూల్చేశారనే వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థలు స్పష్టత ఇచ్చాయి. కుటుంబంతో సహా అసద్ రష్యా చేరుకున్నట్లు తెలిపాయి. వారి కుటుంబానికి మానవతా కోణంలో రష్యా ఆశ్రయం కల్పించినట్లు వివరించాయి. తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం అసద్ సిరియాను వీడారని ఇప్పటికే రష్యా తెలిపింది.

News December 9, 2024

తెలంగాణలో భారీ పెట్టుబడులు

image

TG: రాష్ట్రంలో రూ.1,500కోట్ల పెట్టుబడులకు Lenskartతో ఎంవోయూ చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ కంపెనీ కళ్లద్దాల పరికరాలకు సంబంధించిన ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అక్కడ కళ్లద్దాలు, లెన్స్, సన్ గ్లాసెస్ తదితర వస్తువులు ఉత్పత్తి అవుతాయన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల దాదాపు 2100 మందికి ఉద్యోగాలు వస్తాయని ‘X’లో వెల్లడించారు.