News June 28, 2024
‘మెరుపు’లా వస్తోన్న కళ్యాణ్ రామ్?
నందమూరి కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Similar News
News December 10, 2024
BREAKING: మోహన్ బాబుకు పోలీసుల నోటీసులు
TG: <<14843588>>మీడియాపై దాడి<<>> నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు విష్ణు, మనోజ్‌కు నోటీసులిచ్చారు. వీరిని రేపు ఉదయం 10.30 గంటలకు CP కార్యాలయానికి హాజరు కావాలన్నారు. కాగా మోహన్ బాబు గన్‌ను పోలీసులు సరెండర్ చేసుకున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News December 10, 2024
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ట్వీట్
TG: డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘4 కోట్ల ప్రజల మనోఫలకాలపై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి నేడు సచివాలయ నడిబొడ్డున నిజమైన రూపంగా అవతరించిన శుభ సందర్భం. ఇది తల్లి రుణం తీసుకున్న తరుణం’ అని Xలో రాసుకొచ్చారు.
News December 10, 2024
జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి.. ఆరా తీసిన మంత్రి
TG: మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు. జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. మరోవైపు మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.