News November 7, 2024
ట్రంప్‌నకు కమల ఫోన్ కాల్
డొనాల్డ్ ట్రంప్‌నకు కమలా హారిస్ ఫోన్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రంప్‌నకు కాల్ చేసి కంగ్రాట్స్ తెలిపారు. అధికార మార్పిడిపై చర్చించేందుకు వైట్‌హౌస్‌కు రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై US ప్రజలను ఉద్దేశించి బైడెన్ త్వరలోనే ప్రసంగించనున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 8, 2024
చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా VSR వ్యాఖ్యలు: వర్ల రామయ్య
AP: ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబుకు ముప్పు తలపెట్టేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను డీజీపీ, HRC సీరియస్‌గా తీసుకోవాలన్నారు. VSR, అతని బృందం కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. Dy.CM పవన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే CM చంద్రబాబు లక్ష్యమని విజయసాయి విమర్శించిన విషయం తెలిసిందే.
News December 8, 2024
మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదు చేయలేదు: పీఆర్ టీమ్
మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర <<14823100>>ఫిర్యాదులు<<>> చేసుకున్నారనే వార్తలను మోహన్ బాబు పీఆర్ టీమ్ ఖండించింది. మనోజ్ గాయాలతో వెళ్లి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ గొడవపడ్డారని, పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
News December 8, 2024
డాకు మహారాజ్‌కు మాస్ మహారాజా వాయిస్ ఓవర్?
బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. బాలయ్య పాత్రను మాస్ మహారాజా పరిచయం చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారని టాలీవుడ్ టాక్. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.