News April 8, 2025
బాంబే హైకోర్టును ఆశ్రయించిన కమ్రా

తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘శివసేన శిండే వర్గం నాపై పెట్టిన కేసులన్నీ నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవే. స్వేచ్ఛగా భావాన్ని వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం నాకు కల్పించింది. దయచేసి ఆ కేసుల్ని కొట్టేయండి’ అని అందులో కోరారు. కమ్రా పిటిషన్‌ను కోర్టు నేడు విచారించనుంది.
Similar News
News April 25, 2025
ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన ప్రయాణాలు

పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. US, UK, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదూర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైమ్ పెరగడంతో టికెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
News April 25, 2025
కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.
News April 25, 2025
ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం