News November 17, 2024
రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి

AP: తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు కృషి చేసిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రేపు ఆయన 537వ జయంతి నిర్వహణకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట స్థాయిలో అనంతపురంలో, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ ఘనంగా వేడుక నిర్వహించాలని ఆదేశించింది. ఈయన కన్నడలో నలచరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామధ్యాన చరిత్రే, మోహన తరంగిణి అనే రచనలు చేశారు.
Similar News
News November 15, 2025
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.
News November 15, 2025
iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.
News November 15, 2025
యాంటీబయాటిక్స్తో ఎర్లీ ప్యూబర్టీ

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్ ప్రికాషియస్ ప్యుబర్టీ అంటారు.


