News November 17, 2024
రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి
AP: తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు కృషి చేసిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రేపు ఆయన 537వ జయంతి నిర్వహణకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట స్థాయిలో అనంతపురంలో, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ ఘనంగా వేడుక నిర్వహించాలని ఆదేశించింది. ఈయన కన్నడలో నలచరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామధ్యాన చరిత్రే, మోహన తరంగిణి అనే రచనలు చేశారు.
Similar News
News December 2, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 2, 2024
శుభ ముహూర్తం
తేది: డిసెంబర్ 02, సోమవారం
మార్గశీర్ష శు.పాడ్యమి: మ.12.43 గంటలకు
జ్యేష్ఠ: మ.03.43 గంటలకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: తె.12.19-1.04 గంటల వరకు,
మ.2.33-3.18 గంటల వరకు
News December 2, 2024
సీఎస్కేకి ఆడాలనుకోవడానికి కారణమదే: చాహర్
పేసర్ దీపక్ చాహర్‌ను వేలంలో ముంబై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను తొలి నుంచీ CSKకి ఆడాలనుకున్నానని చాహర్ తెలిపారు. ‘ఫస్ట్ నుంచీ ధోనీ నాకు అండగా నిలిచారు. అందుకే CSK అంటే అంత ఇష్టం. పర్స్ తక్కువ ఉండటంతో ఈసారి ఆ టీమ్‌కి వెళ్లనని ముందే అర్థమైంది. రూ.13 కోట్ల పర్స్ ఉంటే రూ.9 కోట్ల వరకూ నాకోసం ట్రై చేశారు. ఏదేమైనా.. ఇప్పుడు మరో గొప్ప ఫ్రాంచైజీకి ఆడనున్నానని సంతోషంగా ఉంది’ అని వివరించారు.