News August 3, 2024
మార్ఫింగ్ ఫొటోతో రాహుల్‌పై కంగన విమర్శలు

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై BJP MP కంగన విమర్శలు చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలో రాహుల్ ఉన్నట్లు మార్ఫ్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘కులం తెలియని వ్యక్తి కుల గణన చేయాలంటున్నారు’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. కులాల పేరుతో దేశాన్ని చీల్చాలని చూస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. కాగా ఆమె అటెన్షన్ కోసమే రాహుల్‌ను టార్గెట్ చేశారని కామెంట్స్ వస్తున్నాయి.
Similar News
News December 8, 2025
పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.
News December 8, 2025
CBSE తరహాలో టెన్త్ ఎగ్జామ్స్?.. షెడ్యూల్‌పై ఉత్కంఠ

TG: CBSE తరహాలో పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి SSC పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు 2, 3 రోజులు గ్యాప్ ఉంచి 2 రకాల షెడ్యూళ్లను CMOకు పంపారు. మధ్యలో రంజాన్, ఉగాది, మహవీర్ జయంతి, శ్రీరామ నవమి ఉండడంతో 4 రోజుల వ్యవధీ ఉండనుంది. ఈ ప్రతిపాదనలపై CM నిర్ణయం తీసుకోకపోవడంతో పరీక్ష తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ షెడ్యూల్ వెలువడిన వారంలోగా టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రావాల్సి ఉండగా నెలరోజులవుతున్నా తేలలేదు.
News December 8, 2025
ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి: ప్రియాంకా గాంధీ

ముఖ్యమైన సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే వందేమాతరంపై చర్చ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ‘వందేమాతరం కేవలం గేయం కాదు అది ప్రజల గొంతుక. ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి. వేల మంది మరణిస్తున్నారు. త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై చర్చను వదిలేసి ఈ సమయంలో జాతీయ గేయంపై చర్చ అవసరమా?’ అని లోక్‌సభలో ప్రియాంక పేర్కొన్నారు.


