News November 18, 2024
కంగన ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
వివాదాల్లో చిక్కుకున్న నటి కంగన చిత్రం ‘ఎమర్జెన్సీ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. JAN 17న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. దేశ అత్యంత శక్తిమంతమైన మహిళ గాథ, భారత భవితవ్యాన్ని మార్చిన సందర్భం ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమైనట్టు తెలిపారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై సిక్కులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సెన్సార్ కట్స్ అనంతరం చిత్రం విడుదలవుతోంది.
Similar News
News December 9, 2024
భూఅక్రమాల్లో ఎక్కడ చూసినా YCP నేతలే: హోంమంత్రి
AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. బియ్యం అక్రమ రవాణా మీద CIDతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా YCP నేతల పాత్ర ఉందని ఆరోపించారు. విశాఖలో మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటికొచ్చాయన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపామని, ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టిందని హోంమంత్రి విశాఖలో వెల్లడించారు.
News December 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 9, 2024
బిగ్‌బాస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్
Bigg Boss సీజన్-8 నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాగా, శనివారం రోహిణి హౌస్ నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. చివరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. చివరి దశకు చేరుకున్న ఈ సీజన్ టాప్-5లో నబీల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లు ఉన్నారు.