News August 27, 2024

కంగనా వ్యాఖ్యలు దేశంలోని రైతులకు ఘోర అవమానకరం: రాహుల్

image

రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన <<13945604>>వ్యాఖ్యలు <<>>హరియాణా, పంజాబ్‌తో సహా దేశంలోని రైతులందరికీ ఘోర అవమానకరమని రాహుల్ గాంధీ అన్నారు. రైతు వ్యతిరేక భావజాలం మోదీ ప్రభుత్వ డీఎన్ఏ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. అధికార పార్టీ కంగనా వ్యాఖ్యలతో ఏకీభవించకపోతే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Similar News

News September 10, 2024

బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తిచేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చెయ్యాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం మూడు నెలల్లో కులగణన పూర్తిచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

News September 10, 2024

16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వాడొద్దన్న AUS ప్రభుత్వం!

image

సోషల్‌మీడియా వినియోగం పిల్లలను తప్పుదారి పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించనుంది. మొబైల్‌కే పరిమితం కాకుండా పిల్లలు మైదానంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పీఎం వెల్లడించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్‌ తదితర యాప్స్‌ను పిల్లలు వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

News September 10, 2024

గ్లోబల్ స్టేజ్‌పై భారత్‌ను విస్మరించలేరు: కాంగ్రెస్ ఎంపీ

image

ప్రపంచ ఆర్థిక, రాజకీయాల్లో అత్యంత కీలకమైన భారత్‌ను విస్మరించరాదని, అలాగే తక్కువ అంచనా వేయలేరని కాంగ్రెస్ MP శశి థరూర్ స్పష్టం చేశారు. ‘వేగంగా పెరుగుతున్న జనాభా, ఎకానమీ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను అత్యంత కీలకంగా మార్చేశాయి. జియో పాలిటిక్స్‌లో చైనా, పాక్, USతో సవాళ్లు ఎదురవుతున్నా సమతూకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకొనే నిర్ణయాలు ప్రపంచంపై సుదీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి’ అని అన్నారు.