News November 14, 2024

‘కంగువా’ మూవీ రివ్యూ & RATING

image

1000 ఏళ్ల క్రితం తన జాతి, ఓ పిల్లాడి తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో చేసిన పోరాటమే కంగువా కథ. తన పర్ఫామెన్స్, యాక్షన్ సీన్లతో సూర్య మెప్పించారు. విజువల్స్ బాగున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్లుగా బలమైన ఎమోషన్ సీన్లు లేకపోవడం మైనస్. మ్యూజిక్ బాగున్నా అక్కడక్కడ లౌడ్ BGM ఇబ్బంది కలిగిస్తుంది. ప్రస్తుతానికి, గత జన్మకు డైరెక్టర్ సరిగా లింక్ చేయలేకపోయారు. ఫస్టాఫ్ స్లోగా ఉంటుంది.
RATING: 2.25/5

Similar News

News December 6, 2024

ఆర్టీసీ పికప్ వ్యాన్‌ల సేవలు ప్రారంభం

image

TGSRTC దూర ప్రాంత ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ECIL-LB నగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలను ప్రారంభించింది. విశాఖ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, కందుకూరు వెళ్లే వారి కోసం ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.

News December 6, 2024

పిల్లలకు ఈ పేర్లు పెట్టరు!

image

మా బిడ్డకు మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాం అంటే కొన్ని దేశాల్లో కుదరదు. పలు రకాల పేర్లు చట్ట విరుద్ధం. జర్మనీ, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్‌లో అడాల్ఫ్ హిట్లర్ పేరు పెట్టకూడదు. జపాన్‌లో అకుమా(దెయ్యం), మెక్సికోలో ఆల్‌ పవర్, సౌదీలో అమీర్, పోర్చుగల్‌లో అశాంతి, మలేషియాలో చౌ టౌ, యూకేలో సైనైడ్, డెన్మార్క్‌లో మంకీ, జర్మనీలో ఒసామా బిన్ లాడెన్, డెన్మార్క్‌లో ప్లూటోవంటి పేర్లపై నిషేధం ఉంది.

News December 6, 2024

పుష్ప-2 మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

image

‘పుష్ప-2’ సినిమాలోనివి అంటూ ఫేక్ డైలాగ్స్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని మైత్రీ సంస్థ ప్రకటించింది. ‘ఊహాజనితమైన, సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2లోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పెట్టడం మానేయండి’ అని ట్వీట్ చేసింది. పైరసీపై వాట్సాప్‌లో(8978650014) రిపోర్ట్ చేయాలని కోరింది.