News November 3, 2024

‘కంగువ’ టికెట్ ధరలు పెంపు?

image

తమిళ హీరో సూర్య నటించిన ‘కంగువ’ ఈనెల 14న రిలీజ్ కానుంది. టాలీవుడ్ టైర్-1 హీరో మూవీ రిలీజ్ మాదిరిగానే భారీస్థాయిలో ఇక్కడ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 4AM షోస్‌కు, టికెట్ ధరల పెంపునకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో డబ్బింగ్ మూవీకి హైక్ ఇవ్వడమేంటని కొందరు Xలో ప్రశ్నిస్తున్నారు. మన సినిమాలకు అక్కడ కనీసం థియేటర్లు కూడా ఇవ్వట్లేదని మండిపడుతున్నారు. మీ కామెంట్?

Similar News

News December 26, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జ‌రిగిందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు ముందు 118 నియోజ‌క‌వ‌ర్గాల్లో 72 ల‌క్ష‌ల ఓట్ల‌ను జోడించార‌ని, అందులో 102 చోట్ల BJP విజ‌యం సాధించింద‌న్నారు. LS ఎన్నిక‌ల త‌రువాత AS ఎన్నిక‌ల‌కు ముందు ఈ అక్ర‌మాలు జరిగినట్టు వివ‌రించారు. అయితే, ఏక‌ప‌క్షంగా ఓట‌ర్ల తొల‌గింపు, కొత్త ఓట‌ర్లను చేర్చ‌డం సాధ్యంకాద‌ని ఇటీవ‌ల EC వివ‌ర‌ణ ఇవ్వ‌డం తెలిసిందే.

News December 26, 2024

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్నారు. త్వరలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఆయన ఆడనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఆయన అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. కాగా హార్దిక్ వన్డేలు ఆడక ఏడాది దాటిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023లో గాయపడినప్పటి నుంచి ఆయన ఈ ఫార్మాట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో హార్దిక్ వన్డేలపై దృష్టి సారించారు.

News December 26, 2024

ప్రముఖ RJ, ఇన్‌స్టా ఫేమ్ ఆత్మహత్య

image

రేడియో జాకీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్(25) ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్‌లో సెక్టర్-47లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సిమ్రాన్‌కు ఇన్‌స్టాలో సుమారు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అభిమానులు ఆమెను ‘జమ్మూ కి ధడ్‌కన్’గా పిలుచుకుంటారు. సిమ్రాన్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.