News December 13, 2024

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ మంజూరు

image

క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్‌కు క‌ర్ణాట‌క హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ద‌ర్శ‌న్‌తోపాటు ప‌విత్రా గౌడ స‌హా ఈ కేసులో ప్ర‌ధాన నిందితులైన మ‌రో ఐదుగురికి కోర్టు బెయిల్ ఇచ్చింది. డిసెంబర్ 9న దర్శన్ బెయిల్ పిటిషన్‌పై తుది వాదన విన్న జస్టిస్ విశ్వజిత్ శెట్టి తాజాగా తీర్పు వెలువరించారు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జూన్ 11న పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 17, 2025

వరంగల్: లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డులకు కోసం 1.57లక్షల దరఖాస్తులు గతంలోనే వచ్చాయి. ఆత్మీయ భరోసాకు 18 లక్షల EGS కార్డులు ఉన్నాయి.రైతు భరోసాలో 8.77 లక్షలు గత సీజన్‌లో లబ్ధి పొందారు. వీటిపై ఈ నెల 20 వరకు దరఖాస్తులను పరిశీలించి, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు.

News January 17, 2025

ACCIDENT: 9 మంది దుర్మరణం

image

మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.

News January 17, 2025

ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!

image

రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్‌తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్‌), నాలుగో ప్లేస్‌లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.